BREAKING
బీఎస్-6 వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ గడువు పెంపు శ్రీలంకలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు భారత్ ఇటలీ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 20 బిలియన్ యూరోలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా ధరలపై కలెక్టర్ సమీక్ష కావ్య మారన్ కోసం పెళ్లి వేడుకలో అనిరుధ్ పాట.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ! ఏపీఎన్జీవోస్ ఆధ్వర్యంలో 504 మంది మహిళా ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు శ్రీలంక 2027 బడ్జెట్ రుణ తగ్గింపు బాటలోనే.. ఫిచ్ రేటింగ్స్ కీలక అంచనాలు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి - మండల వైద్యాధికారి ఎరువుల కొనుగోలుకు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ తప్పనిసరి మహిళా సాధికారతకు సింగరేణి చేయూత గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 మూడవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ప్రకృతి సాగుతోనే రైతులకు భరోసా - కలెక్టర్ రాజర్షిషా మైసా కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. రష్మిక మందన్న భావోద్వేగ పోస్ట్ వైరల్! ఎంపీ వంశీకృష్ణను అవమానించే రాజకీయాలు మానుకోవాలి - మాల మహానాడు నాయకుల హెచ్చరిక

మైసా కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. రష్మిక మందన్న భావోద్వేగ పోస్ట్ వైరల్!

Select Suryaa Now
మైసా కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. రష్మిక మందన్న భావోద్వేగ పోస్ట్ వైరల్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న ఆసక్తికర పోస్ట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మైసా కోసం పడిన కష్టం, తీసుకున్న శిక్షణ గురించి ఆమె తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విశేషంగా వైరల్ అవుతోంది.

మైసా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ప్రయాణం షూటింగ్ ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే మొదలైందని రష్మిక వివరించారు. కఠినమైన శిక్షణ, ముందస్తు సన్నాహాలు, ప్రతిరోజూ ఎదురైన చిన్నచిన్న సవాళ్లు తన ప్రయాణంలో భాగమయ్యాయని తెలిపారు. గతంలో ఎప్పుడూ చేయని కొత్త విషయాలను ప్రయత్నించేందుకు తనను తాను ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకున్నానని, ఇదొక ప్రత్యేకమైన, మరపురాని అనుభవమని పేర్కొన్నారు.

ఇప్పటివరకు పలు సినిమాల్లో గ్లామరస్, కమర్షియల్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రష్మిక, మైసా చిత్రంలో పూర్తి భిన్నమైన, పవర్‌ఫుల్ అవతారంలో కనిపించనున్నారు. యాక్షన్ ప్రాధాన్యత ఉన్న ఈ కథ కోసం ఆమె శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించినట్లు ఆమె మాటలను బట్టి స్పష్టమవుతోంది.

రష్మిక పంచుకున్న ఈ పర్సనల్ జర్నీపై అభిమానులు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొత్త సవాళ్లను స్వీకరిస్తూ తన పరిధులను విస్తరించుకుంటున్న రష్మిక కృషిని ప్రశంసిస్తూ, మైసా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.