telangana
మహిళా సాధికారతకు సింగరేణి చేయూత
సూర్య నస్పూర్ : మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ కోర్సులను ప్రారంభించారు. గురువారం నస్పూర్ సేవాభవన్ గోదావరి ఫంక్షన్ హాల్‌లో శ్రీరాంపూర్ ఏరియా సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్యూటీషియన్, మగ్గం వర్క్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను ప్రారంభించారు. గత ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న 366 మందికి ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ సర్టిఫికెట్లను అందజేశారు.
సింగరేణి సేవా సమితి ద్వారా 21 రకాల వృత్తి విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం క్రాంతి కుమార్, సేవా సెక్రటరీ కొట్టె జ్యోతి, సేవా సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.