telangana
ఎంపీ వంశీకృష్ణను అవమానించే రాజకీయాలు మానుకోవాలి - మాల మహానాడు నాయకుల హెచ్చరిక
సూర్య నస్పూర్ : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేపడుతున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలను అడ్డుకుంటూ దళిత నాయకుల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని మాల మహానాడు మంచిర్యాల జిల్లా నాయకులు అన్నారు. గురువారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కాకా వెంకటస్వామి స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంపీ వంశీకృష్ణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాగులు, షూస్, ఇతర విద్యా సామగ్రిని అందిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు హాజరైన ఎస్సీ, ఎస్టీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులకు సహాయం చేయడం తప్పా ఎంపీ చేసిన తప్పేంటో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి కుటుంబం అండగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేసిందని గుర్తుచేశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వంశీకృష్ణను అవమానించేలా మాట్లాడటం తగదన్నారు. దళిత నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పైడిమల్ల నర్సింగ్, పొట్ట మధుకర్, సుధమల అశోక్ తేజ, దమ్మ నారాయణ, భూపెల్లి మల్లన్న, పాముల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.