BREAKING
57వ ఇఫీ ముగింపు చిత్రంగా ఆంథోనీ చెన్ ‘వీ ఆర్ ఆల్ స్ట్రేంజర్స్’ అనకాపల్లి ఎంపీపీగా బొడ్డపాటి నారాయణమ్మ ఎంపిక. పుట్టగొడుగుల పెంపకంపై ఉచిత శిక్షణ రామళ్లకోట సర్పంచ్ బరిలో మంచిరెడ్డి మౌనిక టీడీపీ నాయకుడు శశికళధరప్ప (శశి) కుటుంబం నుంచి అభ్యర్థిత్వం జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే జాప్ ప్రధాన లక్ష్యం! జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం చేస్తాం ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తపోవనం బుద్ధిమాంద్య ఆశ్రమంలో కేక్ కట్ చేసి, పండ్ల పంపిణీ.. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జర్నలిస్టు నేతలు జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే జాప్ ప్రధాన లక్ష్యం! జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం చేస్తాం ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తపోవనం బుద్ధిమాంద్య ఆశ్రమంలో కేక్ కట్ చేసి, పండ్ల పంపిణీ.. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జర్నలిస్టు నేతలు 83 వేలు దాటిన సెన్సెక్స్, 25,500 పైకి చేరిన నిఫ్టీ విశ్వక్ సేన్ కల్ట్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే! దీపికా పదుకొణె డిమాండ్‌కు ఆలియా భట్ మద్దతు.. సెట్స్‌లో మహిళలకు కనీస సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు! తైక్వాండోలో పసిడి పతకాల పంట.. జాతీయ స్థాయికి పాత మంచిర్యాల క్రీడాకారులు! కార్పొరేట్ విద్యా సంస్థల లాభాల కోసం విద్యార్థులను బలి చేయడం సరికాదు .. చెప్పేదొకటి ఫీజులు వసూళ్లలో ఆచరించేది ఒకటి. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బీఎస్-6 వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ గడువు పెంపు శ్రీలంకలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు భారత్ ఇటలీ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 20 బిలియన్ యూరోలు

ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు
సూర్య రాజంపేట : రాజంపేట మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని, భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడు పటేల్ సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను కొనియాడారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని అన్నారు. మహిళా నాయకత్వానికి ఆమె ఆదర్శంగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామంలోని వివిధ శాఖల అధ్యక్షులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు..