అనకాపల్లి ఎంపీపీగా బొడ్డపాటి నారాయణమ్మ ఎంపిక.
అనకాపల్లి, నవంబర్ 19, మేజర్ న్యూస్: అనకాపల్లి మండల ఎంపీపీగా తుమ్మపాల - 2 సిగ్మెంట్ నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన బొడ్డపాటి నారాయణమ్మ ఎన్నికయ్యారు. మండల సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం అనంతరం మండలంలోని 26 మంది ఎంపీటీసీలు సంయుక్తంగా ఎన్నికల అధికారి, ప్రొసైడింగ్ ఆఫీసర్ రామనాథం ఆధ్వర్యంలో బొడ్డపాటి నారాయణమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. అనంతరం ఎంపీపీగా ఆమె ప్రమాణ స్వీకారం నిర్వహించారు. వైస్ ఎంపీపీ గా సిహెచ్.ఎన్ అగ్రహారం గ్రామానికి ఎంపీటీసీ మద్దాల వెంకటేష్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి శెట్టి రామ్ కి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆశాజ్యోతి, డిప్యూటీ ఎంపీడీవో బి రాము. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.