BREAKING
రెండో రోజు ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్లు! దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘం : మిట్స్‌లో ఘనంగా మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం ఈ నెల 21న స్పెషల్ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి పవన్ కళ్యాణ్,జనసేనను విమర్శిస్తే సహించేది లేదు : జనసేన మహిళ నేత రూ.7 కోట్ల స్కాం ఆరోపణలు అవాస్తవం : ఖండించిన జనసేన నాయకులు గణి రాయల్,జగదీష్ రాయల్ పవన్ కళ్యాణ్,జనసేనను విమర్శిస్తే సహించేది లేదు : జనసేన మహిళ నేత రూ.7 కోట్ల స్కాం ఆరోపణలు అవాస్తవం : ఖండించిన జనసేన నాయకులు గణి రాయల్,జగదీష్ రాయల్ దుర్గిలో నూతన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే జూలకంటి అభినందనలు ఈ నెల 24న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం ఈ నెల 24న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం మదనపల్లి ఎంపీపీగా బీదం గురునాథ్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాంతి భద్రతలకు అడ్డంకులు కల్పించే వారిపై కఠిన చర్యలు. కలెక్టర్ పి రాజబాబు. వెల్దుర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ. పుష్పవతి భారతీయ సినిమా భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఇఫీ 2026 అనుమతులు లేకుండా బోర్లు వేస్తే క్రిమినల్ కేసులు: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు ఏడాది జైలు, రూ.95 లక్షల జరిమానా ఖరారు.. న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందన్న నటుడు! గ్రంథాలయం నందు మహిళా దినోత్సవ వేడుకలు.

తిరుపతి పారిశుధ్యంపై కమిషనర్ ప్రత్యేక దృష్టి

Select Suryaa Now
తిరుపతి పారిశుధ్యంపై కమిషనర్ ప్రత్యేక దృష్టి

తిరుపతి పారిశుధ్యంపై కమిషనర్ ప్రత్యేక దృష్టి

*బస్టాండ్ నుంచి అలిపిరి వరకు క్షేత్రస్థాయి పరిశీలన

తిరుపతి నగరంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ముఖ్యంగా భక్తులు, ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాలను పరిశీలించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, వినాయక సాగర్, మంగళం రోడ్డు, అలిపిరి రోడ్డు ప్రాంతాల్లో కాలినడకన తిరిగి పరిస్థితిని స్వయంగా చూశారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, డి.ఈ. రమణ ఉన్నారు. వారు ప్రతి చోటా పారిశుధ్య పరిస్థితి, చెత్త సేకరణ, ఫుట్‌పాత్‌ల నిర్వహణ గురించి కమిషనర్‌కు వివరించారు. ముఖ్యంగా మంగళం రోడ్డు వెంబడి ఫుట్‌పాత్‌లపై కలుపు మొక్కలు దట్టంగా పెరిగి పాదచారులకు ఇబ్బందిగా మారాయని గుర్తించారు. దీంతో పాదచారులు ఫుట్‌పాత్‌ను వదిలి రోడ్డుపై నడవాల్సి వస్తుందని అధికారులు చెప్పారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న కలుపు మొక్కలను వెంటనే తొలగించాలని కమిషనర్ స్పష్టంగా ఆదేశించారు. కేవలం తొలగించడమే కాకుండా, మళ్లీ పెరగకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని సూచించారు. అలాగే బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో పారిశుధ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని చెప్పారు. వినాయక సాగర్ పరిసరాల్లో కూడా చెత్త పేరుకుపోకుండా చూడాలని, రోజూ శుభ్రం చేయాలని ఆదేశించారు. పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. నగరానికి వచ్చే భక్తులకు శుభ్రమైన, అందమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు.

Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,