BREAKING
విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి – టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి సంజీవని కార్యక్రమం – వైద్యాధికారులు మరియు సంజీవిని మిత్రులకు ప్రాయోగిక శిక్షణ కార్యక్రమం ప్రారంభం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రాయిలాపూర్ విద్యార్థినుల ఎంపిక జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి అర్హత ఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు!** సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోంది ఈనెల 25 న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం - జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆటో స్తంభానికి ఢీకొని ముగ్గురికి గాయాలు అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య సమాజ చైతన్యంలో మీడియా పాత్ర కీలకం - జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిర్మల్ ప్రెస్ క్లబ్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.: ఘనంగా ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం సగానికి తగ్గిన డ్రగ్ డిస్కవరీ సమయం, బిగ్ ఫార్మా కంపెనీల చూపు ఆంథ్రోపిక్ వైపు ఇందిరమ్మ బీమాతో రూ.5లక్షల భరోసా డాక్టర్ రోహిత తల్లిదండ్రుల గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక

టీడీపీ పార్టీ అభివృద్ధికి కృషి చేశా... కో-ఆప్షన్ పదవి ఇవ్వండి............ తిరుపతి నగర ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్ఎండి రఫీ

Select Suryaa Now
టీడీపీ పార్టీ అభివృద్ధికి కృషి చేశా... కో-ఆప్షన్ పదవి ఇవ్వండి............ తిరుపతి నగర ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్ఎండి రఫీ

 

టీడీపీ పార్టీ అభివృద్ధికి కృషి చేశా... కో-ఆప్షన్ పదవి ఇవ్వండి

ప్రతి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాను

సేవా కార్యక్రమాలతో తిరుపతి నగర ప్రజలకు సుపరిచితుడిని

తిరుపతి ముస్లిం మైనార్టీ నగర అధ్యక్షుడు ఎస్.ఎం.డి. రఫీ వేడుకోలు

తిరుపతి:  తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించానని, టీడీపీ అధిష్ఠానం కో-ఆప్షన్ పదవిలో తన పేరును పరిశీలించాలని తిరుపతి నగర ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్.ఎం.డి. రఫీ కోరారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నుంచి, చిత్తూరు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఐదు సంవత్సరాలు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానన్నారు. తిరుపతి సిటీ మైనార్టీ ప్రెసిడెంట్ గా ఆరు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నానన్నారు.తిరుపతి ఈద్గా ప్రెసిడెంట్ గా నాలుగు సంవత్సరాలుగా, గతంలో ఏ పార్టీ చేయని విధంగా, తెలుగుదేశం పార్టీలో నేను ఈద్గా చైర్మన్ అయిన తర్వాత చాలా అద్భుతంగా చేశానని ప్రతి ఒక్కరూ తనను మెచ్చుకున్నట్లు తెలిపారు. ఎటువంటి సమస్యలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అందరికీ అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించి, చాలా వరకు ఈద్గా పేరును నిలబెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇంకా ఇంకొక రెండు సంవత్సరాలు తనకు చైర్మన్ గా పదవి ఉందని అన్నారు.తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తూ ఉన్నానని, ఈ మధ్యకాలంలో ఆరోగ్యం సరిలేదని కొంతమంది పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటానని అన్నారు.నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ లో మూర్తి యాదవ్ ని కూడా అఖండ మెజారిటీతో గెలిపించుకున్నామని గుర్తు చేశారు. నా మీద దయ ఉంచి మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ ఇప్పించగలరని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరించి విన్నవించుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేశానని ఆయన అన్నారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీ కమిటీ హాలు, మటన్ మార్కెట్, నెహ్రూ నగర్ లో ఉర్దూ స్కూలు, కెనడి నగర్ లో తమిళ్ స్కూల్స్ - ఇవన్నీ వెంకటరమణ ఆధ్వర్యంలో కట్టించి, వాటికి ఎన్నో సేవా మార్గాలలో నేను పాల్గొన్నానని తెలిపారు. తిరుపతిలో ఎక్కడా లేని విధంగా పెద్ద షాదీ మహల్ కూడా కట్టడం జరిగిందన్నారు.తెలుగుదేశం పార్టీలో ఎన్నో సేవలు చేసి, ఎంతోమందికి సహాయం చేసినా, నేను నా కోసం ఒక చిన్న విన్నపం చేస్తున్నానని, తిరుపతిలో సీనియర్ మైనార్టీ నాయకుడిగా పేరు పొందిన నేను ఎస్.ఎం.డి. రఫీని తిరుపతి కో-ఆప్షన్ మెంబర్ గా నియమించగలరని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఇతర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను తిరుపతి నగర ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్.ఎం.డి. రఫీ కోరారు.

 

శివమూర్తి

స్టాఫ్ రిపోర్టర్ 

నేటి దినపత్రిక సూర్య 

తిరుపతి