telangana
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం - జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
సూర్య, జన్నారం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హత గల ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. జన్నారం మండలం చింతలపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాన్ని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ చంద్రయ్య సందర్శించారు. ఆ పథకం అమలు తీరును పరిశీలించి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు, విద్యా బోధన, ఆహార నాణ్యత తీరును పరిశీలించారు. ఏ సమస్యలున్న సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుటకు అవకాశం ఉంటుందన్నారు. ఈ శిబిరంలో సర్పంచ్ పంజాల సురేష్, కార్యదర్శి గుర్రం రాము, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కాశెట్టి లక్ష్మణ్ తదితరులున్నారు.