telangana
ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని
సూర్య, హుజురాబాద్: ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని అన్నారు.శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వార్డు సభలలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన ఇంటి పెద్దకు 5 లక్షల బీమాను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అర్హులైన ప్రజలంతా మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న వార్డు సభలలో వారి వివరాలను నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి కిషన్, కౌన్సిలర్లు, మేనేజర్ భూపాల్ రెడ్డి, ఎస్ఐ కిరణ్, శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
- మండలంలో గ్రామసభలు...
హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు కోసం గ్రామాలలో అధికారులు ప్రజల వివరాలను నమోదు చేసుకున్నారని హుజురాబాద్ ఎంపీడీవో తూర్పాటి సునీత తెలిపారు.