BREAKING
సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా శైలజ తేజో మూర్తి ఘనంగా సిఐడి ఐ.జి బి రాజకుమారి జన్మదిన వేడుకలు ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు పులివెందులలో ఉద్రిక్తత... గంటకు పైగా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం కల్పించాలి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోండి. ముసురు తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి

నెల్లూరు జడ్పీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుభాకాంక్షలు

Select Suryaa Now
నెల్లూరు జడ్పీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుభాకాంక్షలు

​కావలి, మేజర్ న్యూస్ :  నెల్లూరు జిల్లా, ప్రజా పరిషత్ (జడ్పీ) నూతన చైర్మన్‌గా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైస్ చైర్మన్‌గా పొట్టేళ్ల ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వీరిద్దరితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.​అదేవిధంగా, కావలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గెలుపొందిన కూటమి అభ్యర్థులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.​ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నూతన జడ్పీ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్‌లతో పాటు కావలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసిన కూటమి ప్రజాప్రతినిధులకు హృదయపూర్వకశుభాకాంక్షలు తెలియజేశారు..​ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ..​జిల్లా అభివృద్ధిలో, గ్రామీణ ప్రాంతాల ప్రగతిలో స్థానిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.​సమర్థులైన నేతలు ఏకగ్రీవంగా జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా ఎన్నికవడం హర్షణీయమని పేర్కొన్నారు.​కావలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించి ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు.​నూతన జడ్పీ పాలకవర్గం, మండల స్థాయిప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడానికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.​కావలి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.