చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్గా శైలజ తేజో మూర్తి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్:చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్గా పూతలపట్టు జడ్పీటీసీ సభ్యురాలు ఎం. శైలజ, వైస్ చైర్మన్గా గుడుపల్లి మండల జడ్పీటీసీ సభ్యురాలు ఎస్.మంజుల ప్రియ వెంకటేష్ ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా లోని వివిధ మండలాల నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.జిల్లా లోని బైరెడ్డిపల్లె మండలం నుంచి బి. సుబ్రమణ్యం చెట్టి, చిత్తూరు మండలం ఎస్. మంజుల, గంగాధర నెల్లూరు మండలం నుంచి ఎస్. యేసుమణి, గంగవరం మండలం ఎ. ప్రతాప్ కుమార్ రెడ్డి, గుడుపల్లి మండలం ఎస్.మంజుల ప్రియ వెంకటేష్, ఐరాల మండలం ఎం. మహేష్, కార్వేటినగరం మండలం బి. జగదీష్, కుప్పం మండలం బి. స్వాతి, నగరి మండలం పి. రాధిక, నిండ్ర మండలం డి. వాసు, పెనుమూరు మండలం పి. నిరీష జడ్పీటీసీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.అదే విధంగా పలమనేరు మండలం ఎస్. నాగరాజారెడ్డి, పెద్దపంజాణి మండలం అనమక్కగారి జయరామిరెడ్డి, పూతలపట్టు మండలం ఎం. శైలజ, పులిచెర్ల మండలం వి. మోహన్, రామకుప్పం మండలం ఎం. బుజ్జమ్మ, రొంపిచెర్ల మండలం వుయ్యాల రాజేశ్వరి, ఎస్.ఆర్.పురం మండలం కె. అమ్ము, శాంతిపురం మండలం ఇ. విజయరామిరెడ్డి, తవణంపల్లె మండలం జి. వెంకటేశ్వర చౌదరి, వి.కోట మండలం డి.ఎన్. కుమార్, వెదురుకుప్పం మండలం నెలవోయి రాధిక, విజయపురం మండలం కె. బాబు, యాదమరి మండలం కె. యశోద, గుడిపాల మండలం ఆర్.మమత శ్రీ జడ్పీటీసీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎన్నికలో పూతలపట్టు జడ్పీటీసీ సభ్యురాలు ఎం. శైలజ పేరును విజయపురం మండల జడ్పీటీసీ సభ్యుడు కె. బాబు ప్రతిపాదించగా, పలమనేరు మండల జడ్పీటీసీ సభ్యుడు ఎస్. నాగరాజారెడ్డి బలపరిచారు. దీంతో ఎం. శైలజ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు.అదేవిధంగా వైస్ చైర్మన్ పదవికి గుడుపల్లి మండల జడ్పీటీసీ సభ్యురాలు మంజుల ప్రియ వెంకటేష్ పేరును కుప్పం మండల జడ్పీటీసీ సభ్యురాలు బి. స్వాతి ప్రతిపాదించగా, శాంతిపురం మండల జడ్పీటీసీ సభ్యుడు ఇ. విజయరామిరెడ్డి బలపరిచారు. అనంతరం మంజుల ప్రియ వెంకటేష్ జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు.ఈ ఎన్నికలతో చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గంలో నూతన నాయకత్వం బాధ్యతలు స్వీకరించారు.
ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.