BREAKING
క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలు తమిళనాడు పెట్టుబడుల లీక్ ప్రచారంపై మంత్రి లోకేష్ చమత్కార కౌంటర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ, సింగపూర్ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా తౌహీద్ మస్జీద్‌లో దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జడ్పీటీసీ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బత్తలపల్లికి తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు. భూమిరెడ్డిపల్లి లో మల్లేశ్వరి ముమ్మర ప్రచారం 40వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి బట్టే పార్టీ అశోక్ కి మహిళలు బ్రహ్మరథం..! దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ నామినేషన్ దాఖలు చేస్తున్న వైద్య విద్యార్థి అమృత ములకలచెరువు ఎంపీపీగా కట్ట దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి..

దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత

Select Suryaa Now
దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత

గుంటూరు : దేశ భవిష్యత్తుకు పునాదులైన బాలల సమగ్రాభివృద్ధి మరియు వారి హక్కుల పరిరక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మలత పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు సంతోష్ నగర్‌లోని క్రైస్తవ మహిళా ఒకేషనల్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో, ఆర్నాల్డ్ పౌలస్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా పద్మలత మాట్లాడుతూ బాలలకు విద్య అత్యంత కీలకమని, విద్యార్థినులు ఒక నిర్దిష్ట ప్రణాళిక, లక్ష్యంతో ఇష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలను కూడా అలవర్చుకోవాలన్నారు. బాలలకు ఏదైనా సమస్య ఎదురైతే తక్షణమే 1098 (చైల్డ్‌లైన్) టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, పెద్దలను గౌరవిస్తూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు.​కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డి. ప్రశాంతి మాట్లాడుతూ, విద్యార్థినులు ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండి, పూర్తి ఏకాగ్రతతో చదువుపైనే దృష్టి సారించాలని హితవు పలికారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలలోపు వారందరినీ బాలలుగా గుర్తిస్తారని, ఐక్యరాజ్యసమితి ఆమోదంతో భారతదేశంలో 1992 నవంబర్ 20న బాలల హక్కుల దినోత్సవంగా ప్రకటించారని గుర్తుచేశారు. బాలలకు ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు అనే నాలుగు రకాల హక్కులు ఉన్నాయని, వాటిని కాపాడేందుకు ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయని వివరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసన్న మాట్లాడుతూ బాలలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, స్వేచ్ఛ అందిస్తే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎం. సత్యవాణి మాట్లాడుతూ, బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా 'కార్డ్స్' సంస్థ 'బాలబాట' కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిందని కొనియాడారు.అంతకుముందు కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన కోలాటం, అవగాహన స్కిట్ సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరగా జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.

 

సూర్య నాయక్