BREAKING
క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలు తమిళనాడు పెట్టుబడుల లీక్ ప్రచారంపై మంత్రి లోకేష్ చమత్కార కౌంటర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ, సింగపూర్ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా తౌహీద్ మస్జీద్‌లో దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జడ్పీటీసీ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బత్తలపల్లికి తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు. భూమిరెడ్డిపల్లి లో మల్లేశ్వరి ముమ్మర ప్రచారం 40వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి బట్టే పార్టీ అశోక్ కి మహిళలు బ్రహ్మరథం..! దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ నామినేషన్ దాఖలు చేస్తున్న వైద్య విద్యార్థి అమృత ములకలచెరువు ఎంపీపీగా కట్ట దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి..

ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్

Select Suryaa Now
ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: స్థానిక జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్ల గోడౌన్ ను శుక్రవారం జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ తనిఖీ చేశారు. ఈవిఎం గోడౌన్ వద్ద సిసి కెమేరాలతో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, ఈవిఎం యంత్రాలు బి.యులు, సియులు, వివిప్యాట్ లను, అధికారులతో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశించారు. అనంతరం పరిశీలన రిజిస్టరులో జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ సంతకం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీలో భాగంగా ఈవిఎం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవిఎం గోడౌన్ కు పటిష్ట భధ్రత కల్పించామన్నారు. ఎప్పటి కప్పుడు గోడౌన్ క్షుణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామన్నారు.ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే మోహన్ కుమార్,ఈవీఎం గోడౌన్ నోడల్ ఆఫీసర్ మరియు శ్రీలక్ష్మి, ఎలక్షన్ సూపర్డెంట్ రాజేంద్రన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.