ములకలచెరువు ఎంపీపీగా కట్ట దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి..
ములకలచెరువు, మేజర్ న్యూస్, నవంబర్20: ములకలచెరువు మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) కట్ట దొరస్వామి నాయుడు ఎన్నికల అధికారి కళ్యాణ్, ఎంపీడీవో అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మండలంలోని మొత్తం 13 మంది ఎంపీటీసీలకు గాను 11 మంది ఎంపీటీసీలు ఎన్నికల కార్యక్రమానికి హాజరయ్యారు. వారందరూ చేతులు పైకెత్తి కట్ట దొరస్వామి నాయుడుకు తమ మద్దతు ప్రకటించడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీపీ కట్ట దొరస్వామి నాయుడు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎంపిక చేసిన ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ ఎన్నికలో ఎంపీటీసీలు కే రవీంద్ర సోంపల్లి 2 , చాట్ల మురుగేషన్ దుర్గ కదిరినాధునికోట, షేక్ చాంద్ బాషా చౌడ సముద్రం, కే భవాని వేపూరి కోట, బుట్ట సుబ్బలక్ష్మి సోంపల్లి 1,పి.కిట్టమ్మ మద్దినాయనపల్లి, జె కృష్ణమూర్తి గుడుపల్లి, అగ్రహారం సుమీయ కాల్వపల్లి, పాల్యం నరసింహులు పెద్దపాలెం ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు మోహన్ ప్రతాప్, సుధాకర్ పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె..