BREAKING
పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా తౌహీద్ మస్జీద్‌లో దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జడ్పీటీసీ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బత్తలపల్లికి తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు. భూమిరెడ్డిపల్లి లో మల్లేశ్వరి ముమ్మర ప్రచారం 40వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి బట్టే పార్టీ అశోక్ కి మహిళలు బ్రహ్మరథం..! దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ నామినేషన్ దాఖలు చేస్తున్న వైద్య విద్యార్థి అమృత ములకలచెరువు ఎంపీపీగా కట్ట దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి.. పేదలకు అందని సచివాలయ సేవలు జెడ్పిటిసి గా దీవించారు మీ రుణం తీర్చుకుంటా. ముదిగుబ్బ జడ్పిటిసి సాని రంజిత్ కుమార్ రెడ్డి మురసు తుపానుపనుల పునరుద్ధరణకు రూ.8.63 కోట్లు

పేదలకు అందని సచివాలయ సేవలు

Select Suryaa Now
పేదలకు అందని సచివాలయ సేవలు

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :    గత ప్రభుత్వంలో ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని ఏర్పాటుచేసిన  వార్డు సచివాలయాలలో  సౌకర్యాలు అందక పేదప్రజలు పడే అవస్థలు వర్ణాతీతంగా ఉంటున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో 166 వార్డు  సచివాలయాలను అప్పట్లో ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం సచివాలయాల్లో అవసరమైన పనులు లేకపోవడంతో కొంతమంది సిబ్బంది అలా వచ్చి, ఇలా వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ప్రజలు వివిధ పనులపై రెవెన్యూలో సేవల కోసం అక్కడ స్వర్ణ వార్డ్  సచివాలయాలకు వెళ్ళగా కొందరు ఉద్యోగులు కార్పొరేషన్ కు వెళ్ళినట్లు చెబుతూ కాలం గడపడం విశేషం. అదేవిధంగా కొందరు వీఆర్వోలు అందుబాటులో లేక నిరుపేదలు పడే అవస్థలు వర్ణాతీతం. ఇతర డ్యూటీలంటూ కొందరు వీఆర్వోలు అందుబాటులో లేకుండా ఉండడం గమనార్హం. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా, వార్డు సచివాలయంలోనే వారికి సేవలందే విధంగా ఆయా విభాగాలకు సంబంధించి సెక్రటరీలను ఏర్పాటు చేశారు. అయితే వీరిలో కొంతమంది ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అడ్మిన్లు స్వర్ణ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండకుండా ఉండడం 
గమనార్హం. వీరి వల్ల లక్షల రూపాయల్లో ఖాళీ స్థలాల పన్నులను కార్పొరేషన్ కోల్పోతోందని పలువురు అంటున్నారు. సామాన్య ప్రజలు స్వర్ణ వార్డు  సచివాలయాలకు వెళ్ళగా అక్కడ కొందరి వల్ల  ప్రజలకు  సరైన గౌరవం కూడా దక్కకపోవడం, వారి పట్ల చిన్నచూపు చూడడం కొంతమందికి పరిపాటిగా మారింది. పక్క ఉద్యోగి ఎక్కడికి వెళ్ళాడో కూడా చెప్పే పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులు లేకపోవడం విశేషం. కొన్ని వార్డు సచివాలయాల్లో  బర్త్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, కరెంట్ మీటర్ల దరఖాస్తుకు  అవసరమైన వాటికోసం  వెళ్లగా అక్కడ కనీస సమాచారం కూడా ఇచ్చేవారు లేకపోవడం విశేషం. కొంతమంది సెలవులు పెట్టేసి ఇతర పరీక్షలు కూడా రాసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వార్డు సచివాలయాల్లో వారు ఎక్కడికి వెళ్తున్నారు ? ఏం చేస్తున్నారో తెలిపే మూమెంట్ రిజిస్టర్ కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. పేద ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించవలసిన స్వర్ణ వార్డు సచివాలయాలు నిరక్షరాసులను తిప్పుకుంటూ వారి పట్ల కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విశేషం. కేవలం ఆయా వార్డు సచివాలయాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం తో అది ప్రజలకు శాపంగా మారింది. అక్కడ ఎంత మంది వస్తున్నారో వారికి అందుతున్న సేవలపై పర్యవేక్షణ లేకపోవడం విశేషం.  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో అసలు ఎవరు విధులు నిర్వహిస్తున్నారు, ఎవరు నిర్వహించడం లేదో పరిశీలించకపోవడంతో, కొంతమంది ఉద్యోగులు ఆడింది ఆట పాడింది పాటగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక్కొక్క స్వర్ణ వార్డు  సచివాలయానికి సమస్యలపై, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, ఎన్ని పరిష్కరిస్తున్నారు అని పరిశీలించే వారే లేకపోవడం గమనార్హం. ఎవరికి వారే అన్నట్లుగా కొందరి తీరు ఇక్కడ ఉన్నట్లు పలు విమర్శలు వినవస్తున్నాయి. చాలా వార్డు సచివాలయాలకు అద్దె చెల్లిస్తుండడంతో ఆ భవనాలు చూస్తే అవి వార్డు సచివాలయాలా లేక అద్దె ఇండ్లా అనేది కూడా తెలియని పరిస్థితిలో కొన్ని కార్యాలయాలు ఉన్నాయి. కనీసం వచ్చిన వారికి కూర్చునేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడం, వారిని నిలబెట్టి మాట్లాడడం, కొందరు నిర్లక్ష్యంగా మాట్లాడడం జరుగుతోందని పలువురు అంటున్నారు. వార్డు సచివాలయాల కంటే గతంలో రెవెన్యూ కార్యాలయంలోనే త్వరగా పనులు చేసి పంపేవారని పలువురు అంటున్నారు. అదే తరహాలో  వీఆర్వోలు తహసిల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉండే విధంగా తహసిల్దార్ పరిధిలో ఉండే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి పేద ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, వారు పొందుతున్న సేవలను పరిశీలిస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు.