BREAKING
బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి ఆదిభట్ల శ్రీచైతన్య కాలేజీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య జడ్పీ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్‌పర్సనుగా తలారి శరణ్యలు ఎంపిక : మంత్రితో కలిసి ఘనంగా సన్మానించిన శ్రీరామ్ చినబాబు 38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..! ఎన్నికల అధికారులకు శిక్షణ బాపట్ల జిల్లాకు మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలు తమిళనాడు పెట్టుబడుల లీక్ ప్రచారంపై మంత్రి లోకేష్ చమత్కార కౌంటర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ, సింగపూర్ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా తౌహీద్ మస్జీద్‌లో దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జడ్పీటీసీ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బత్తలపల్లికి తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు. భూమిరెడ్డిపల్లి లో మల్లేశ్వరి ముమ్మర ప్రచారం

పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా

Select Suryaa Now
పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా

 

*-ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి*

*-ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి*

*యాదాద్రి ప్రతినిధి మేజర్ న్యూస్*
కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని 18, 35, 6, 7 వార్డుల ప్రజల కోసం నెహ్రూ–కెన్నెడీ పార్కులో ఏర్పాటు చేసిన పథకం నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన అర్హులకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు భరోసా లభిస్తుందన్నారు. సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పోత్నాక్ ప్రమోద్, బర్రె జహంగీర్, పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్, కౌన్సిలర్లు పాశం అమర్నాథ్, జంగిటి వినోద్, కుక్కదువు పద్మ-సోమయ్య, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.