కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి..
సాహసం చేసిన తల్లి...
కుమారుడికి పునర్జన్మ..
దోరేపల్లి గ్రామ సర్పంచ్ బొక్క ఎల్లమ్మ..
కనగల్ మేజర్ న్యూస్: మండలంలోని దోరేపల్లి గ్రామ సర్పంచ్ బక్క ఎల్లమ్మ తన రెండవ కుమారుడైన బక్క శంకర్కు కిడ్నీ దానం చేసి కొడుకు పునర్జన్మ ను ప్రసాదించింది. తన బిడ్డ ప్రాణాల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే తల్లి ప్రేమకు హద్దులు ఉండమని మరోసారి నిరూపించారు. శంకర్ ఎల్లమ్మకు రెండవ కుమారుడు అనారోగ్య సమస్యలతో కిడ్నీ మార్పిడికి అవసరమైన కిడ్నీ 66 ఏళ్ల వయసులో సాహసం చేసి ఇచ్చింది. కుమారుడి ప్రాణాలు కాపాడడం కోసం ఎల్లమ్మ ఏమాత్రం వెనకాడకుండా కిడ్నీ దానానికి ముందుకొచ్చి శాస్త్ర చికిత్స ద్వారా తన కిడ్నీని కుమారుడికి అందించారు. సాధారణంగా తల్లి తన బిడ్డకు జన్మనిస్తుంది. కానీ బక్క ఎల్లమ్మ తన కుమారుడికి మరోసారి జీవితాన్ని ప్రసాదించి తల్లి ప్రేమకు అర్ధాన్నిచ్చింది. గ్రామస్తులు, నాయకులు ఆమె సాహసాన్ని కొనియాడారు.