భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలులో నున్న సాధనమండలి బ్రహ్మ విద్యాశ్రమంలో చాతుర్మాస్య వ్రత దీక్షల సమాప్తం సందర్భంగా శుక్రవారం 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం ఆశ్రమ అధ్యక్షరాలు బూర్లే అరుణకుమారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సాధన మండలి ఉపాధ్యక్షురాలు కోట సంధ్యారాణి- శివన్నారాయణ లు జ్యోతి ప్రజ్వలనను చేసి కార్యక్రమాలను ప్రారంభిచారు. అనంతరం చిన్మయానంద స్వామి శిష్యులు అక్కినపల్లి తుకారాం విశిష్ట అతిథిగా విచ్చేశారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం 259వ గీతా జ్ఞాన కర్పూరయగ్నంలో అచ్యుత నాగ రమేష్-సాయి సంధ్య, పాలకుర్తి మనోహర్- మాధవి, కపిలవాయి శ్రీనివాసరావు- ఝాన్సీ రాణి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం దీపోత్సవం, తదనంతరం వెయ్యి మంది భక్తులకు కార్తీక సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.