బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం..
బద్వేలు మేజర్ న్యూస్:సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఖండన,స్వాతంత్ర ఉద్యమంలో మీ పాత్ర ఏమిటో చెప్పగలరా
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కి సూటి ప్రశ్న వేసిన సిపిఐ ఎంఎల్ లేబరేషన్ పార్టీ నాయకులు.కమ్యూనిస్టులపై బిజెపి నాయకుల అసత్య, ఆరోపణలను, అబద్దపు, ప్రచారాలను సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీగా తీవ్రంగాఖండిస్తున్నామని ఆ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పై విధంగా స్పందించారు. విజయవాడలో
బిజెపి రాష్ట్ర కమిటీ ప్రచురించిన జాతీయ భావం కొరవడిన కమ్యూ నిస్టులు అనే పుస్తకావిష్కరణ సభలో జాతీయ ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర గురించి బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నాయకులు చేసిన ఉపన్యాసం వక్రీకరణలు, తీవ్రమైన అసత్యాలు, అబద్ధాలతో కూడిన తప్పుడు ప్రచారాలను సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు .స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీషు వాళ్ళ కొమ్ముకాచి వెన్నుపోటు పొడిచిన బిజెపి, ఆరఎసఎస్‌ల అసలు బండారాన్ని దాచిపెట్టి కమ్యూనిస్టులపై నిందలు మోపడం సూర్యుడిపై ఉమ్మివేయడమేఅని హితువు పలికారు. ఇప్పటికైనా కమ్యూనిస్టులపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోకపోతే రానున్న రోజులలో కమ్యూనిస్టులు సత్తా ఏమిటో చూపిస్తామని ఈ సందర్భంగా వారు ఘాటుగా విమర్శించారు.
రిపోర్టర్. సి.రవికుమార్ బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ,కడప జిల్లా