ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం
కురబలకోట,మేజర్ న్యూస్ : కురబలకోట మండలంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడంతోపాటు మహిళా సాధికారతపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.ఈ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ ద్వారకనాథ్ మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలతోపాటు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని పెంపొందించే వివిధ పుస్తకాలను కూడా విద్యార్థులు చదవాలని సూచించారు.పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని,అవగాహనను పెంపొందించుకోవచ్చని తెలిపారు.అనంతరం ఎంఈఓ ద్వారకనాథ్ చేతుల మీదుగా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహు మతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్,తెలుగు ఉపాధ్యాయుడు జనార్ధన్,ఉపాధ్యాయుడు శ్రీనివాసులు,పాఠకులు సి.శివప్రసాద్,విద్యార్థులు,గ్రంథాలయ సిబ్బంది ఏ.పద్మావతమ్మలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి