సిపిఐ సీనియర్ మహిళా నాయకురాలు దివంగత శకుంతలమ్మ అందించిన సేవలు చిరస్మరణీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. నారాయణస్వామి కొనియాడారు. శుక్రవారం స్థానిక నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో.. శకుంతలమ్మ రెండవ వర్ధంతి ని సిపిఐ నగర సహాయ కార్యదర్శి బి రమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శకుంతలమ్మ చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పి. నారాయణస్వామితో నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో, మహిళా సమస్యల పరిష్కారంలో శకుంతలమ్మ చేసిన సేవలను స్మరించారు. మహిళల హక్కుల కోసం, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆమె చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.గత రెండు సంవత్సరాలక్రితం అనారోగ్యం తో మృతి చెందారు మరణానంతరం పార్టీవ దేహాన్ని కూడా పరిశోధన ల నిమిత్తం అనంతపురం మెడికల్ కాలేజీకి అందజెయడం జరిగిందన్నారు. ఆమె పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు , సీపీఐ సీనియర్ నాయకులు,సూర్యనారాయణరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సి. లింగమయ్య, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పార్వతి ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు కె. అలిపీర, ఎల్లుట్ల నారాయణస్వామి, చాంద్ బాషా, గాదిలింగ, మహిళా సమైక్య నగర అధ్యక్షురాలు యశోదమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.