పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
-
పులివెందుల మేజర్ న్యూస్:
పోలీసుల సమక్షంలోనే సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న కాన్వాయ్ పై అంకాలమ్మ గూడూరు దగ్గర టిడిపి రౌడీలు రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సింహాద్రిపురం మండలంలోని బలపనూరు , చెవారిపల్లి, హిమకుంట్ల తో పాటు సర్పంచ్ అభ్యర్థులతో వెళుతున్న నాపై దాడి చేశారన్నారు. పులివెందుల డిఎస్పి మురళి నాయక్ కు హైకోర్టు ఆర్డర్ చూపించిన ప్రయోజనం లేదన్నారు. అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి వెళ్లిన తర్వాత లోపల బీటెక్ రవి అనుచరులు నామినేషన్లను చించివేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన మార్పు రాలేదన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో మా అభ్యర్థులపై దాడులు చేసి మాపైనే కేసులో నమోదు చేయడం జరిగింది అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 900 మంది పైన అక్రమ కేసు పెట్టడం జరిగిందన్నారు.నామినేషన్లు వేయించేందుకే అభ్యర్థులను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నాను. సింహాద్రిపురం ఎస్ఐకి ముందుగానే మెసేజ్ పెట్టాను. సీఐకి సమాచారం ఇచ్చాను. హైకోర్టు ఆర్డర్లు కూడా పంపించాను. గురువారం నుంచి ఎస్పీతో పదులసార్లు మాట్లాడి ఆదేశాలను అమలు చేయాలని కోరాను. గురువారం సాయంత్రం మా అభ్యర్థులను తీసుకెళ్లి నామినేషన్ పత్రాలు చించి వెనక్కి పంపించారు. గురువారం కూడా అదే పరిస్థితి రాకూడదని నేనే స్వయంగా అభ్యర్థులను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటే మా మీద, మా కార్ల మీద రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. అసలు పోలీసుల సమక్షంలోనే దాడి జరుగుతుంటే శాంతిభద్రతలు ఉన్నాయా? ప్రజాస్వామ్యం ఉందా? నామినేషన్లు వేయడానికి వెళ్తున్న మా అభ్యర్థులను అడ్డుకోవడం, దాడులు చేయడం, మళ్లీ వారిపైనే కేసులు పెట్టడం ఏం పోలీసింగ్? ఏం ప్రభుత్వం? అని ప్రశ్నించారు.
డీఎస్పీ మురళీ నాయక్ 70 వాహనాలతో వెళ్లామని చెబుతున్నారు. అది పూర్తిగా అవాస్తవం. నేను కేవలం ఐదు వాహనాల్లోనే వెళ్లాను. పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చి, హైకోర్టు ఆదేశాల ప్రకారం మా అభ్యర్థులను మీకు అప్పగిస్తాం, మీరు తీసుకెళ్లి నామినేషన్లు వేయించండి అని చెప్పాను. అయినా మాకు ఈ పోలీసులపై ఒక్క శాతం కూడా నమ్మకం లేదు. వేల్పుల రాముపై 2025 ఆగస్టులో జరిగిన దాడి నుంచి ఇడుపులపాయ, చక్రాయపేట, తొండూరు వరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.మా వాళ్లపై దాడులు చేసి, రివర్స్‌గా వారిపైనే 307 సెక్షన్ కేసులు పెడుతున్నారు. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, నాన్ బెయిలబుల్ సెక్షన్. ఇష్టం వచ్చినట్టు ఈ సెక్షన్లు పెట్టి వందల మంది, వేల మంది వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. మేము నామినేషన్లు వేయడానికి వెళ్తే అడ్డుకోవడం, మా మీదే కేసులు పెట్టడం ఇదేనా ప్రజాస్వామ్యం? పెట్రోల్ బాంబులతో, రాళ్లతో ఒక మనిషిపై దాడి చేస్తే దాన్ని ఏమంటారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈ మాత్రం దానికి ఎన్నికల కమిషన్ ఎందుకు? ఈ నామినేషన్ల ప్రక్రియ ఎందుకు? ప్రతి సామాన్యుడూ ఒక్కసారి ఆలోచించాలన్నారు.
పి. కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా