దిగజారిన మేకపాటి కుటుంబం..!
మర్రిపాడు, మేజర్ న్యూస్ : మేకపాటి కుటుంబం దిగజారే స్థాయికి వచ్చిందని, పంచాయితీ పోరులో కూడా స్వగ్రామమైన మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు తిష్ట వేసి నానా తంటాలు పడుతున్నారని అదే గ్రామానికి చెందిన అన్నవరం దేవస్థానం డైరెక్టర్ బిజివేముల సురేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేకపాటి కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా ఎంపీలుగాను, మంత్రులుగాను, శాసనసభ్యులుగా వ్యవహరించినప్పటికీ ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటమి భయం పట్టుకొని నివాసంలోనే ఉండి స్థానికులతో చర్చలు జరుపుతుండడం విశేషం అన్నారు. ఇప్పటికే బ్రాహ్మణపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడంతో వైయస్సార్సీపి పార్టీలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న మేకపాటి కుటుంబానికి చుక్క ఎదురయిందన్నారు. అంతేకాకుండా గతంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బలపరిచిన అభ్యర్థి విజయకేతనం ఎగురవేసిన రికార్డు ఉందని గుర్తు చేశారు. ఈ రికార్డు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే మార్మోగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూడా మంత్రి ఆనం ఆశీస్సులతో సర్పంచ్ బరిలో ఉన్న బిజివేముల సరోజనమ్మ అదే రికార్డును నెలకొల్పి తప్పకుండా విజయకేతనం ఎగురవేస్తుందని తెలిపారు. ఈ విధంగా మేకపాటి కుటుంబం శాసించే స్థాయి నుంచి సర్పంచ్ ఎన్నికలు జరిపించే స్థాయికి దిగజారారని ఎద్దేవా చేశారు.