BREAKING
బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి ఆదిభట్ల శ్రీచైతన్య కాలేజీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య జడ్పీ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్‌పర్సనుగా తలారి శరణ్యలు ఎంపిక : మంత్రితో కలిసి ఘనంగా సన్మానించిన శ్రీరామ్ చినబాబు 38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..! ఎన్నికల అధికారులకు శిక్షణ బాపట్ల జిల్లాకు మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలు తమిళనాడు పెట్టుబడుల లీక్ ప్రచారంపై మంత్రి లోకేష్ చమత్కార కౌంటర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ, సింగపూర్ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా తౌహీద్ మస్జీద్‌లో దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జడ్పీటీసీ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బత్తలపల్లికి తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు. భూమిరెడ్డిపల్లి లో మల్లేశ్వరి ముమ్మర ప్రచారం

భూమిరెడ్డిపల్లి లో మల్లేశ్వరి ముమ్మర ప్రచారం

Select Suryaa Now
భూమిరెడ్డిపల్లి లో మల్లేశ్వరి ముమ్మర ప్రచారం

- భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి

పామూరు, మేజర్ న్యూస్ : వగ్గంపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరి శుక్రవారం సాయంత్రం  పంచాయతీ పరిధిలోని భూమిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజలు ఆశీర్వదించాలని మల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టిడిపి నేతలు ఎంపీటీసీ సభ్యులు ఎలికా కొండమ్మ, ఎలికా నారాయణ, చావా రాజేంద్ర, చావా హరికృష్ణ, బైరెడ్డి రమణారెడ్డి, పుట్లూరి బ్రహ్మారెడ్డి, రాగిపిండి వెంకట వరప్రసాద్, కాశి నారాయణ, బైరెడ్డి సురేంద్ర, గంగిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.