తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ, సింగపూర్ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సింగపూర్ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘనస్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి ఆశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.