BREAKING
దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ నామినేషన్ దాఖలు చేస్తున్న వైద్య విద్యార్థి అమృత ములకలచెరువు ఎంపీపీగా కట్ట దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి.. పేదలకు అందని సచివాలయ సేవలు జెడ్పిటిసి గా దీవించారు మీ రుణం తీర్చుకుంటా. ముదిగుబ్బ జడ్పిటిసి సాని రంజిత్ కుమార్ రెడ్డి మురసు తుపానుపనుల పునరుద్ధరణకు రూ.8.63 కోట్లు ఊపిరి ఉన్నంతవరకు చట్టాన్ని గౌరవిస్తా.. పులివెందుల డిఎస్పి మురళి నాయక్ దిగజారిన మేకపాటి కుటుంబం..! సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు లోని శ్రీ మోటూరు రామారావు శాఖా గ్రంథాలయము నందు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి యన్. దేవరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని విద్యార్థులు క్రమం తప్పకుండా గ్రంథాలయాలకి వచ్చే అలవాటు చేసుకోవాలని ఎంతోమంది మేధావులు గ్రంథాలయంలో చదువుకొని ఎదిగారని సూచించారు. గ్రంథాలయ స్థల దాత కుమారులు మోటూరు శ్రీరామ నాగ మురళీకృష్ణ మాట్లాడుతూ మేము ఇచ్చిన స్థలము గ్రంథాలయానికి ఉపయోగపడుతున్నందుకు, గ్రంథాలయం అభివృద్ధి చెందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు బొలిశెట్టి శ్రీనివాసరావు చదవడం ప్రాముఖ్యత మరియు డిజిటల్ గ్రంథాలయాలపై అవగాహన కల్పించారు. అనంతరం వివిధ పోటీలలో విజేత లైన  30 మంది విద్యార్థులకు అతిథుల చేతుల మీదగా బహుమతులు అమ్మ చేశారు. కార్యక్రమంలో పాఠశాల విశ్రాంత గ్రంథాలయాధికారి కోట వెంకట సుబ్బారావు, శాఖా గ్రంథాలయాధికారి కలపాల సుభాష్ చంద్రబోస్, తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.