BREAKING
దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ నామినేషన్ దాఖలు చేస్తున్న వైద్య విద్యార్థి అమృత ములకలచెరువు ఎంపీపీగా కట్ట దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి.. పేదలకు అందని సచివాలయ సేవలు జెడ్పిటిసి గా దీవించారు మీ రుణం తీర్చుకుంటా. ముదిగుబ్బ జడ్పిటిసి సాని రంజిత్ కుమార్ రెడ్డి మురసు తుపానుపనుల పునరుద్ధరణకు రూ.8.63 కోట్లు ఊపిరి ఉన్నంతవరకు చట్టాన్ని గౌరవిస్తా.. పులివెందుల డిఎస్పి మురళి నాయక్ దిగజారిన మేకపాటి కుటుంబం..! సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

పులివెందులలో ఉద్రిక్తత... గంటకు పైగా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Select Suryaa Now
పులివెందులలో ఉద్రిక్తత... గంటకు పైగా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పులివెందుల మేజర్ న్యూస్:

పులివెందులలో ఉద్రిక్తత  వాతావరణం నెలకొంది. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పై దాడి జరగడంతో పోలీసులు అవినాష్ రెడ్డిని భద్రత నిమిత్తం  పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి గంటకు పైగా బయటికి రాకుండా పోలీస్ స్టేషన్లో ఉంచారు. భారీగా వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకుని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ,కడప మాజీ మేయర్ సురేష్ బాబు పులివెందులకు చేరుకున్నారు. సంయమనం పాటించాలని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. పులివెందులలో శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. టీడీపీ గూండాలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డా సంయమనం పాటించాలని కార్యకర్తలకు అవినాష్‌రెడ్డి సూచించారు.అంకాలమ్మ గూడూరు ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. తమ పార్టీ సానుభూతిపరులు నామినేషన్ వేయకుండా పెట్రోల్ బాంబులతో దాడి చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వెంటనే తమవజిల్లా నామినేషన్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కోరింది.

పి కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా