BREAKING
సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా శైలజ తేజో మూర్తి ఘనంగా సిఐడి ఐ.జి బి రాజకుమారి జన్మదిన వేడుకలు ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు పులివెందులలో ఉద్రిక్తత... గంటకు పైగా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం కల్పించాలి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోండి. ముసురు తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి

అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక

అనకాపల్లి ప్రతినిధి, మేజర్ న్యూస్:  

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మరియు వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన చైర్ పర్సన్ మరియు వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక జరిగింది.
రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయకుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్య బాబు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.ముందుగా జిల్లా కలెక్టర్ జిల్లాలో గల 24 మండలాలలో గెలుపొందిన జడ్పిటిసి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పరవాడ జడ్పిటిసి సభ్యురాలు మోటూరి నాగమణిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అభ్యర్థిగా నర్సీపట్నం జడ్పిటిసి అభ్యర్థి సుకల రమణమ్మ ప్రతిపాదించగా, కసింకోట జడ్పిటిసి అభ్యర్థి పొన్నగంటి నాగమణి బలపరిచారు. మిగిలిన జడ్పిటిసి సభ్యులు అంగీకరించడంతో ఏకగ్రీవంగా మోటూరి నాగమణిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఎన్నికయ్యారు.జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ గా మునగపాక జడ్పిటిసి సభ్యురాలు పెంటకోట స్వాతిని అనకాపల్లి జడ్పిటిసి సభ్యులు పల్లెల నాగేశ్వరరావు ప్రతిపాదించగా, బుచ్చయ్యపేట జడ్పిటిసి సభ్యురాలు పోతుల భవాని బలపరిచారు. మిగిలిన జడ్పిటిసి సభ్యు లు ఆమోదించడంతో ఏకగ్రీవంగా పెంటకోట స్వాతి జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలోని 24 జడ్పీటీసీ  స్థానాలకు సంబంధించి 24 మంది సభ్యులు నేడు ప్రమాణస్వీకారం మరియు చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ ఎన్నికకు  హాజరయ్యారని తెలిపారు. పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు మోటూరు నాగమణి చైర్ పర్సన్ గా మరియు మునగపాక జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతి వైస్ చైర్‌పర్సన్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.జడ్పిటిసి సభ్యులు గా  తెలుగుదేశం పార్టీ నుండి అమలకంటి రమణమ్మ ,  అల్లు రామనాయుడు,  కనిశెట్టి సన్యాసిరావు, గోరా చంద్రశేఖర్, కోటా నీలవేణి,  కురచ రమేష్, పల్లెల నాగేశ్వరరావు, నాగవేణి పురం, గంట్యాడ రమేష్, రమణమ్మ సుకల, పుప్పాల లక్ష్మీనారాయణ, పీలా హైమావతి, లెక్కల సన్యాసి నాయుడు, రొంగలి మహేశ్వరరావు, రాజేశ్వరి కిలపర్తి, సుర్ల సత్యం నాయుడు, స్వాతి పెంటకోట,  జనసేన పార్టీ నుండి సేనాపతి రత్నం, మోటూరు నాగమణి, రావి చలపతి, మామిడి అరుణ, పోతుల భవాని, బిజెపి పార్టీ నుంచి పొన్నగంటి నాగమణి, శ్రీరంగం బ్రమరేశ్వరి ఎన్నికయ్యారు. చివరగా రాష్ట్ర హోం శాఖ మాత్యులు వంగలపూడి అనిత తో పాటు  శాసనసభ్యులు మరియు కార్పొరేషన్ల చైర్మన్లు గెలుపొందిన జడ్పిటిసి అభ్యర్థులను శాలువ కప్పి సన్మానించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో సత్యనారాయణ, డిప్యూటీ సీఈవో రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్. రవికుమార్ ,ఎన్డిపి సూర్య ప్రతినిధి 

అనకాపల్లి జిల్లా