BREAKING
సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా శైలజ తేజో మూర్తి ఘనంగా సిఐడి ఐ.జి బి రాజకుమారి జన్మదిన వేడుకలు ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు పులివెందులలో ఉద్రిక్తత... గంటకు పైగా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం కల్పించాలి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోండి. ముసురు తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి

అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి

Select Suryaa Now
అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి

మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా పరిషత్ నూతన,మొట్టమొదటి  చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శుక్రవారం మదనపల్లె పట్టణం,బెంగళూరు రోడ్డులో,రవీంద్రనాథ్ ఠాగూర్ కాటేజీ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు,ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షత వహించారు.నూతనంగా ఎన్నికైన 25 మంది జడ్పీటీసీ సభ్యుల్లో సమావేశానికి హాజరైన 19 మంది సభ్యులతో తొలుత ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పుంగనూరు జడ్పీటీసీ సభ్యులు తోమరం నరసింహులు,కురబలకోట జడ్పీటీసీ సభ్యులు పిళ్లింగారి సురేంద్ర యాదవ్ కలిసి గాలివీడు జడ్పీటీసీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు పేరును ప్రతిపాదించగా,హాజరైన సభ్యులందరూ బలపరిచారు.అదేవిధంగా వైస్ చైర్మన్ పదవికి కేవీ పల్లి జడ్పీటీసీ సభ్యులు పి.రెడ్డి మహేంద్ర,కలకడ జడ్పీటీసీ సభ్యులు ఎర్రయ్యగారి వెంకటరమణ కలిసి పెద్దతిప్పసముద్రం జడ్పీటీసీ సభ్యురాలు తలారి శరణ్య పేరును ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.దీంతో చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.అనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లతో జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించి, ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

ప్రజాసేవకు అంకితమై జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన చైర్మన్,వైస్ చైర్మన్‌తోపాటు జడ్పీటీసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాసేవకు అంకితమై జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.అనంతరం జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశాలను ముగిస్తున్నట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.ఈ కార్యక్రమానికి ముందుగా రాష్ట్ర రవాణా,యువజన సర్వీసులు,క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై నూతన చైర్మన్,వైస్ చైర్మన్‌తో పాటు జడ్పీటీసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటయిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు జడ్పిటిసిలందరూ కూటమి ప్రభుత్వ ఆశయాల సాధనకు,ప్రజలకు సుపరిపాలన అందించడంలో అంకితభావంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి,పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా,మదనపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు,పుంగనూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు,జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మీపతి,నూతన జడ్పీటీసీ సభ్యులు,ప్రజాప్రతినిధులు,ఎన్నికల అధికారులు,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం