BREAKING
దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ నామినేషన్ దాఖలు చేస్తున్న వైద్య విద్యార్థి అమృత ములకలచెరువు ఎంపీపీగా కట్ట దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి.. పేదలకు అందని సచివాలయ సేవలు జెడ్పిటిసి గా దీవించారు మీ రుణం తీర్చుకుంటా. ముదిగుబ్బ జడ్పిటిసి సాని రంజిత్ కుమార్ రెడ్డి మురసు తుపానుపనుల పునరుద్ధరణకు రూ.8.63 కోట్లు ఊపిరి ఉన్నంతవరకు చట్టాన్ని గౌరవిస్తా.. పులివెందుల డిఎస్పి మురళి నాయక్ దిగజారిన మేకపాటి కుటుంబం..! సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

ముసురు తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు

Select Suryaa Now
ముసురు తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

ముసురు తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు చేసి, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ లైన్లను సరిచేసి, అవసరమైన మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గృహ విద్యుత్ సరఫరాను ముందుగానే పునరుద్ధరించడం జరిగింది.
అలాగే, సాగు వున్న ఆక్వా మరియు వ్యవసాయ (AGL) విద్యుత్ సర్వీసులకు సంబంధించి మిగిలి ఉన్న పునరుద్ధరణ పనులను రేపటిలోగా పూర్తిచేసి, అన్ని సర్వీసులకు పూర్తిస్థాయి లో విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుంది.
        పునరుద్ధరణ ప్రక్రియలో పొరపాటున ఏవైనా వ్యవసాయ( AGL) లేదా ఆక్వా విద్యుత్ సర్వీసు లకు విద్యుత్ సరఫరా లేని ఎడల లేదా విద్యుత్ సరఫరా లో ఏవైనా సమస్యలు ఉన్న సంబంధిత వినియోగదారులు వెంటనే 9440817491 నంబర్‌కు సమాచారం అందించగలరు. తెలియజేసిన వెంటనే సర్వీసులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకుంటాం అని సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ కట్టా.వేంకటేశ్వర్లు  వారు తెలియజేసారు.
రూ.1.30 కోట్ల వ్యయంతో 15 కిలోమీటర్ల 33 కేవీ విద్యుత్ లైన్ ప్రారంభం
          గౌరవ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు, వి ద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా, సుమారు రూ.1.30 కోట్ల వ్యయంతో  ,పల్నాడు జిల్లా పరిధిలోని యడవల్లి 132 కేవీ సబ్‌స్టేషన్ నుంచి ప్రకాశం జిల్లా సంతమాగులూరు వరకు 15 కిలోమీటర్ల 33 కేవీ విద్యుత్ లైన్‌ను విజయవంతంగా ఈరోజు ఛార్జ్ చేయడం జరిగింది. ఈ నూతన 33 కేవీ విద్యుత్ లైన్ అందుబాటులోకి రావడంతో గురిజేపల్లి ,కొప్పెరం ,కొమ్మలపాడు, సంతమాగులూరు సబ్‌స్టేషన్ల పరిధిలో ఎదురవుతున్న 
లో వోల్టేజ్ సమస్యలు గణనీయంగా తగ్గి, ఆయా ప్రాంతాల ప్రజలకు మరింత నాణ్యమైన, స్థిరమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది.
వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తోంది.

 

                                                                         ఇట్లు

                                                       విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్
                                                                  శ్రీ. కట్టా.వేంకటేశ్వర్లు.