BREAKING
సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా శైలజ తేజో మూర్తి ఘనంగా సిఐడి ఐ.జి బి రాజకుమారి జన్మదిన వేడుకలు ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు పులివెందులలో ఉద్రిక్తత... గంటకు పైగా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం కల్పించాలి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోండి. ముసురు తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి

ఎమ్మెల్యే దగ్గుపాటి తనకు తాను సర్టిఫికెట్ లు ఇచ్చుకోవడం హాస్యాస్పదం మాజీ మేయర్ మహమ్మద్ వసీం

Select Suryaa Now
ఎమ్మెల్యే దగ్గుపాటి తనకు తాను సర్టిఫికెట్ లు ఇచ్చుకోవడం హాస్యాస్పదం మాజీ మేయర్ మహమ్మద్ వసీం

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరిగాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. 

మాజీ మేయర్ మహమ్మద్ వసీం తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రాసద్ అనంతపురం నగరంలో ఎన్నికలే ప్రశాంతంగా జరిగాయి కాబట్టే.. వైసీపీ మేయర్ అభ్యర్థి గెలవడం జరిగిందనడం విడ్డ్డూరంగా ఉందన్నారు. 

అనంతపురం నగరంలో ఎన్నికల సందర్భంగా జరిగిన దౌర్జన్యాలు రిగ్గింగ్‌లు, బూత్ క్యాప్చర్‌లు ప్రజలు చూశారన్నారు. స్వయంగా ఎమ్మెల్యేనే పార్టీ కండువా ధరించి బూతులలోకి వెళ్లి ఏజెంట్లను బెదిరించడం, దొంగ ఓట్లు వేయించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగిఉంటే వైసీపీ మేయర్ అభ్యర్థికి మరింత మెజార్టీ పెరగడమే కాకుండా మరిన్ని డివిజన్‌లలో వైసీపీ అభ్యర్థులు మరికొంతమంది గెలుపొందేవారన్నారు. 

అదేవింధంగా అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, పలు ప్రాంతాలలో ఏకపక్షంగా ఎన్నికలు జరిగిన తీరు రాష్ట్ర ప్రజలు చూశారని, ఎమ్మెల్యే దగ్గుపాటి తనకుతాను సర్టిఫికేట్ తెచ్చుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గత రెండున్నరేళ్లుగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. టీడీపీనే వెన్నుపోటు పార్టీ అని ఎన్‌టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ఏ విధంగా పార్టీని లాక్కున్నారో.. 

దగ్గుపాటి ప్రసాద్ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు.కూటమి నేతలు రెడ్ బుక్ పేరిట అరాచకాలు చేస్తున్నారని,తాము కూడా డిజిటల్ బుక్ లో ప్రతిదీ నమోదు చేస్తున్నామని రేపటి రోజు ప్రతి వాటికి సమాధానం చెబుతామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన సూచించారు. విలేకరులు సమావేశంలో మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు సైపుల్లాభేగ్, మాజీ కార్పోరేటర్ ఇషాక్,కమల్,వైసీపీ నాయకులు  కిషోర్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్