BREAKING
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం ఎమ్మెల్యే దగ్గుపాటి తనకు తాను సర్టిఫికెట్ లు ఇచ్చుకోవడం హాస్యాస్పదం మాజీ మేయర్ మహమ్మద్ వసీం శివాలయంలో ప్రత్యేక పూజలు నెల్లూరు జడ్పీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుభాకాంక్షలు భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం..

ఎల్ నినో ప్రభావం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, నూనెగింజల సాగుకు రైతులు మొగ్గు చూపాలి

Select Suryaa Now
ఎల్ నినో ప్రభావం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, నూనెగింజల సాగుకు రైతులు మొగ్గు చూపాలి

చేగుంట ; ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉండటం, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, సాగునీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళికను రూపొందించుకోవాలని చేగుంట మండలం లోని పెద్దశివనూర్ గ్రామసభ లో జిల్లా వ్యవసాయధికారి దేవుకుమార్ గారు సూచించారు.నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, సజ్జ, కంది, పెసర, మినుము, శనగ వంటి పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
అదేవిధంగా వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి నూనెగింజల పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలుపటం జరిగింది.అంతేకాకుండా, దీర్ఘకాలిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉన్న ఆయిల్ పామ్ సాగుపై కూడా రైతులు దృష్టి సారించాలి. ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన నేలలు, తగినంత నీటి వసతి ఉన్న రైతులు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు తీసుకొని సాగు చేపట్టాలని తెలుపటమైనది. ఈ కార్యక్రమం లో  గ్రామ సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ అన్నం మల్లేష్ , వార్డు మెంబెర్స్,MRO, MPDO,MAO, పశువైద్యాధికారి,ఇరిగేషన్ AE, Electricity AE, Housing AE, APO, AEO రైతులు పాలుగోన్నారు.