BREAKING
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం ఎమ్మెల్యే దగ్గుపాటి తనకు తాను సర్టిఫికెట్ లు ఇచ్చుకోవడం హాస్యాస్పదం మాజీ మేయర్ మహమ్మద్ వసీం శివాలయంలో ప్రత్యేక పూజలు నెల్లూరు జడ్పీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుభాకాంక్షలు భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం..

క్విజ్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

Select Suryaa Now
క్విజ్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

రామాయంపేట : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో విజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని రామాయంపేట మండల విద్యాధికారి (ఎంఈఓ) శ్రీనివాస్ అన్నారు. విద్యార్థుల్లో సాధారణ జ్ఞానం, ఆలోచనా శక్తి, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు పోటీతత్వాన్ని అలవర్చేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఇటీవల నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీల్లో రామాయంపేట మండల పరిధిలోని రాయలపూర్, కోనాపూర్, అక్కన్నపేట ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ప్రతిభావంతులుగా నిలిచారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంఈఓ శ్రీనివాస్ అభినందించారు.మండల స్థాయిలో ప్రతిభ చాటుకున్న విద్యార్థులు త్వరలో నిర్వహించనున్న జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో పాల్గొననున్నారని వెల్లడించారు. జిల్లా స్థాయిలోనూ ఇదే ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందిస్తే అన్ని రంగాల్లోనూ రాణించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయలపూర్ కోనాపూర్ అక్కన్నపేట గ్రామాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు