సూర్య కరీంనగర్ : కరీంనగర్ నగరంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు శుక్రవారం నమోదు శిబిరాన్ని సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. పథకం అర్హతలు, నిబంధనలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం కింద రూ.5 లక్షల జీవిత బీమా అందిస్తుండగా, కుటుంబ పోషకులైన 18 నుంచి 59 ఏళ్ల వయస్సు వారు అర్హులని తెలిపారు. ఆధార్ కార్డు ఆధారంగా వయస్సు ధృవీకరణ చేపడుతున్నారని, అర్హులైన వారు సమీప మున్సిపల్ లేదా వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయినుద్దీన్, ఆర్ఐలు కలీముల్లా ఖాన్, కొత్తకొండ శ్యామ్ సుందర్, వార్డు ఆఫీసర్ పారిపెల్లి రాజు, జవాన్ నాగరాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు.