BREAKING
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం ఎమ్మెల్యే దగ్గుపాటి తనకు తాను సర్టిఫికెట్ లు ఇచ్చుకోవడం హాస్యాస్పదం మాజీ మేయర్ మహమ్మద్ వసీం శివాలయంలో ప్రత్యేక పూజలు నెల్లూరు జడ్పీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుభాకాంక్షలు భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం..

కోలాహలంగా సాగిన మీరావలి నామినేషన్

Select Suryaa Now
కోలాహలంగా సాగిన మీరావలి  నామినేషన్

మర్రిపాడు, మేజర్ న్యూస్ :    మర్రిపాడు మండలంలోని నాగినేనిగుంట పంచాయితీ సర్పంచ్ అభ్యర్థి షేక్ మీరావలి నామినేషన్ శుక్రవారం కోలాహలంగా సాగింది. తన నివాసం నుంచి ప్రత్యేక వాహనాల్లో ఓటర్లతో కలిసి నామినేషన్ కేంద్రమైన సింగనపల్లి సచివాలయానికి తరలి వెళ్లారు. బాణసంచా పేలుస్తూ కాన్వాయ్ తో మరియు ఆటోల్లో, మోటార్ సైకిళ్లలో తనకు మద్దతు తెలిపిన ఓటర్లతో కలిసి వెళ్లడంతో ప్రతి ఒక్కరూ నివ్వెర పోక తప్పలేదు. పంచాయితీ పరిధిలోని నాగినేని గుంట గ్రామంతో పాటుగా ఏనేపల్లి, మిట్టపాలెం, బాట గ్రామాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా నామినేషన్ కేంద్రానికి తరలి వెళ్లడంతో విజయానికి సంకేతాన్ని సూచించింది. ఆ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న ఓటర్లకు అభ్యర్థి మీరావలి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీంతో ఆ పంచాయతీలో ఎన్నికల సందడి నెలకొందని చెప్పవచ్చు.