విద్యార్థులకు బహుమతులు అందజేత
నగరం, మేజర్ న్యూస్: మండల పరిధిలోని మంత్రిపాలెం శాఖా గ్రంథాలయంలో 59వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల ఆటలు, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వహణాధికారి జొన్న బ్రహ్మేంద్ర, మంత్రిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, కనకదుర్గ, శిరీష, త్రివిక్రమ్, గ్రామ పెద్దలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.