అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య
తూప్రాన్ : తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్ గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీఈవో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు,ఈ సందర్భంగా సీఈవో ఎల్లయ్య, గ్రామ సర్పంచ్ బక్క స్వరూప నవీన్ గౌడ్, కలిసి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, ఆపద సమయంలో కుటుంబాలకు అండగా నిలవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీఓ శాలిక, ఏపీఓ, ఉపసర్పంచ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ప్రేమ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి లావణ్య,ఈ పథకంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని గ్రామ సర్పంచ్ బక్క స్వరూప నవీన్ గౌడ్ ,తో కలిసి అవగాహన కల్పించారు, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,