ఇందిరమ్మ బీమాతో రూ.5లక్షల భరోసా
నవాబుపేట సూర్య న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం'పోస్టర్‌ను మండల ప్రత్యేక అధికారి సునీత,ఎంపీడీవో జయరాం నాయక్‌లు శుక్రవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..మండల పరిధిలోని అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గలవారు) దురదృష్టవశాత్తు మరణిస్తే,ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పరిహారం అందజేయనున్నట్లు వివరించారు.ఈ పథకం కోసం లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని,పూర్తి ప్రీమియం మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ భద్రూ నాయక్,వివిధ గ్రామాల సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.