BREAKING
భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం.. కోలాహలంగా సాగిన మీరావలి నామినేషన్ ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ నామినేషన్లు! ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు ఎల్ నినో ప్రభావం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, నూనెగింజల సాగుకు రైతులు మొగ్గు చూపాలి విద్యార్థులకు బహుమతులు అందజేత నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం పురోగతి సాధించేనా...ఈ తరం వారు రైలు కూత వినేనా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు ఉండకూడదు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్విజ్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక
సూర్య కరీంనగర్ : క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పోటీతత్వం పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థి ఎం. రుతిక్ రెడ్డి 70వ ఎస్‌జీఎఫ్ అండర్-19 జిల్లా స్థాయి హాకీ పోటీల్లో ప్రతిభ కనబరిచి నవంబర్ 21న రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నరేందర్ రెడ్డి విద్యార్థిని అభినందించి, రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయ పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు నిపుణులైన వ్యాయామ అధ్యాపకుల ద్వారా శిక్షణ, అవసరమైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.