BREAKING
భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం.. కోలాహలంగా సాగిన మీరావలి నామినేషన్ ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ నామినేషన్లు! ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు ఎల్ నినో ప్రభావం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, నూనెగింజల సాగుకు రైతులు మొగ్గు చూపాలి విద్యార్థులకు బహుమతులు అందజేత నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం పురోగతి సాధించేనా...ఈ తరం వారు రైలు కూత వినేనా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు ఉండకూడదు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్విజ్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి – టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి

Select Suryaa Now
విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి – టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి
సూర్య కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, తెలంగాణ వ్యవస్థక అధ్యక్షుడు ముదిగంటి సుధాకర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. శశిజా దేవి హాజరై వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి ఆలయాలని, పుస్తక పఠనం మనిషి జీవితానికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నత స్థితికి చేరుకోవడానికి దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని లక్ష్యాలను సాధించాలని సూచించారు. సంగెం లక్ష్మణరావు మాట్లాడుతూ టీవీలు, సినిమాలతో సమయం వృథా చేయకుండా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకొని విజ్ఞానాన్ని సంపాదించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.