BREAKING
భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం.. కోలాహలంగా సాగిన మీరావలి నామినేషన్ ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ నామినేషన్లు! ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు ఎల్ నినో ప్రభావం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, నూనెగింజల సాగుకు రైతులు మొగ్గు చూపాలి విద్యార్థులకు బహుమతులు అందజేత నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం పురోగతి సాధించేనా...ఈ తరం వారు రైలు కూత వినేనా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు ఉండకూడదు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్విజ్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోంది

Select Suryaa Now
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోంది

రామాయంపేట : ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో భరోసానిస్తోందని సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి అన్నారు. రామాయంపేట మండల పరిధిలోని ఆర్. వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం వై. రాజిరెడ్డి (తండ్రి సిద్ధారెడ్డి)కి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు పొందలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారు మహేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ అనురాధ నరేశ్, మొదటి వార్డు సభ్యురాలు రేవతి గట్టయ్య, ఐదో వార్డు సభ్యురాలు నాగరాణి రాజాగౌడ్, ఏడో వార్డు సభ్యురాలు అక్షిత సంతోష్ తదితరులు పాల్గొన్నారు.