ఘనంగా ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం
నెల్లూరు, మేజర్ న్యూస్ : 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గోడంగవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు నగరపాలక ఉన్నత పాఠశాల వెంగళరావు నగర్ నెల్లూరు ఫస్ట్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో "ఏక్ పేడ్ మాకే నామ్" అనే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఎన్సిసి క్యాడెట్లు మొక్కలను నాటడం జరిగింది. గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ ఏక్ పేడ్ మాకే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం. 2024వ సంవత్సరం జూన్ 5వ తారీఖున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని బుద్ధ జయంతి ఆవరణలో ఒక రావి మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ప్రతి ఒక్కరూ మాతృమూర్తిని గౌరవిస్తూ ఆమె గుర్తుగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలనే లక్ష్యంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ శాఖ లక్ష్యం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 130 లక్షల మొక్కలను నాటి సంరక్షించాలని, ప్రతి గ్రామ పంచాయతీలోనూ కనీసం 100 నుంచి 120 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలలోనూ పాఠశాలల ఆవరణలలోను కళాశాలలలోనూ వీలున్న ప్రతి చోటా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సి.మంజులవాణి ,జి కవిత ఎస్ వెంకటేశ్వర్లు ,ఎస్ నరసింహులు ,ఏడుకొండలు, వీరభద్రుడు, మార్కండేయులు, సురేష్, షారోన్ ,మస్తానమ్మ, షబానా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ధన్యవాదములు. ఫస్ట్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు నగరపాలక ఉన్నత పాఠశాల వెంగళరావు నగర్ ,నెల్లూరు.