ఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు!**
**ఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు!**
**ఓర్వకల్లు మేజర్ న్యూస్:**
ఓర్వకల్లు శాఖా గ్రంథాలయ అధికారి డి. హనుమే నాయక్ ఆధ్వర్యంలోగత వారం రోజులుగానిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారంముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించి ముగించారు .ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.