BREAKING
భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం.. కోలాహలంగా సాగిన మీరావలి నామినేషన్ ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ నామినేషన్లు! ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు ఎల్ నినో ప్రభావం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, నూనెగింజల సాగుకు రైతులు మొగ్గు చూపాలి విద్యార్థులకు బహుమతులు అందజేత నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం పురోగతి సాధించేనా...ఈ తరం వారు రైలు కూత వినేనా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు ఉండకూడదు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్విజ్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

సంజీవని కార్యక్రమం – వైద్యాధికారులు మరియు సంజీవిని మిత్రులకు ప్రాయోగిక శిక్షణ కార్యక్రమం ప్రారంభం

Select Suryaa Now
సంజీవని కార్యక్రమం – వైద్యాధికారులు మరియు సంజీవిని మిత్రులకు ప్రాయోగిక శిక్షణ కార్యక్రమం ప్రారంభం

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  నెల్లూరు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHCs) పరిధిలో సంజీవని కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (UPHCs) వైద్యాధికారులు మరియు పట్టణ సంజీవిని మిత్రులకు (PCCs) నిర్వహిస్తున్న ప్రథమ విడత ప్రాయోగిక శిక్షణ కార్యక్రమాన్ని గౌరవనీయులైన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (DM&HO) Dr. V. సుజాత గారు , నెల్లూరు ప్రారంభించారు.  ఈ శిక్షణ కార్యక్రమం నెల్లూరులోని మద్రాస్ బస్ స్టాండ్ ఎదురుగా, రెడ్‌క్రాస్ సమీపంలోని శ్రీ హర్ష కోచింగ్ సెంటర్‌లో నిర్వహించబడింది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డా. సునీల్ కుమార్ DPMO–NHM, డా . అంసుదర్, PO–NCD, డా. పవన్ జిల్లా DiNC కోఆర్డినేటర్ మరియు వారి బృందం, డా హర్షిత, డా భవ్య DiNC మెడికల్ ఆఫీసర్లు (ToT), డా రమేష్ DPO–NHM మరియు DPMU బృందం పాల్గొన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా వైద్యాధికారులు మరియు సంజీవిని మిత్రులలో అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించి, సంజీవని కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.  తద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, ప్రజలకు మరింత సమర్థవంతమైన ఆరోగ్య సేవలను అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది.