రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ.. అండగా ఉంటామని భరోసా
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మండలం పెంగరగుంట గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మహిళలకు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి శుక్రవారం నివాళులర్పించారు. తంగరగుంట గ్రామానికి చెందిన సాలమ్మ, మునెమ్మ, జ్యోతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మృతుల భౌతిక కాయాలను సందర్శించిన ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు ఒకేసారి మృత్యువాత పడటం హృదయ విదారకమని, ఈ ఘటన గ్రామంలో తీరని విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు.బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై బాధితులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
అనిల్ కుమార్ యాదవ్