రామళ్లకోట సర్పంచ్ బరిలో మంచిరెడ్డి మౌనిక టీడీపీ నాయకుడు శశికళధరప్ప (శశి) కుటుంబం నుంచి అభ్యర్థిత్వం
వెల్దుర్తి ( మేజర్ న్యూస్ ): వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మంచిరెడ్డి మౌనిక ఎన్నికల బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, గతంలో పార్టీ బలోపేతానికి విశేష సేవలందించిన మంచిరెడ్డి శశికళధరప్ప (శశి) కుటుంబం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. రామళ్లకోటలోని దిగువ పేట (ఇంటి నం. 3-13) నివాసి అయిన మంచిరెడ్డి మౌనిక (27), గ్రామ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ పదవికి పోటీకి సిద్ధమయ్యారు. టీడీపీ నాయకుడిగా శశి గారికి గ్రామంలో ఉన్న పరిచయాలు, ప్రజాదరణ తమ విజయానికి దోహదపడతాయని మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే, రామళ్లకోటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.