BREAKING
ఆటో స్తంభానికి ఢీకొని ముగ్గురికి గాయాలు అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య సమాజ చైతన్యంలో మీడియా పాత్ర కీలకం - జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నిర్మల్ ప్రెస్ క్లబ్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.: ఘనంగా ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం సగానికి తగ్గిన డ్రగ్ డిస్కవరీ సమయం, బిగ్ ఫార్మా కంపెనీల చూపు ఆంథ్రోపిక్ వైపు ఇందిరమ్మ బీమాతో రూ.5లక్షల భరోసా డాక్టర్ రోహిత తల్లిదండ్రుల గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక ఇదే ఉత్సాహంతో పనిచేయాలి.. 2029లోనూ కూటమిదే విజయం కావాలి శాతవాహన వర్సిటీ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి - గుంజపడుగు హరిప్రసాద్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ.. అండగా ఉంటామని భరోసా ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ఇద్దరు స్నేహితులు.. ఒకే వేదికపై ఆత్మీయ పలకరింపు! ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

Select Suryaa Now
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

కొండాపూర్ ; మండల పరిధిలోని చెర్ల గోపులారం గ్రామంలో శుక్రవారం భూ రీ సర్వేపై గ్రామసభ నిర్వహించనున్నట్లు తహసీల్దార్ అశోక్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల పునఃసర్వేలో భాగంగా రైతులకు అవగాహన కల్పించడంతో పాటు సర్వే విధానం, ప్రయోజనాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు.

ఎలా నిర్వహిస్తారు.. ఏమిటి ప్రయోజనం?

రీ సర్వేలో భాగంగా పాత రెవెన్యూ రికార్డులు, సెత్వార్, గ్రామ పటాలు, ఎఫ్‌ఎంబీ, పట్టాదారు వివరాలను పరిశీలిస్తారు. ఆధునిక డీజీపీఎస్, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ వంటి సర్వే సాంకేతిక పరికరాల సహాయంతో భూముల కొలతలు, భౌగోళిక హద్దులను గుర్తించి డిజిటల్ మ్యాపులు రూపొందిస్తారు. క్షేత్రస్థాయిలో రైతులు, సరిహద్దు భూయజమానుల సమక్షంలో హద్దులను నిర్ధారించి రికార్డులతో సరిపోల్చుతారు. గుర్తించిన వివరాలపై అభ్యంతరాలు ఉంటే నిబంధనల ప్రకారం పరిశీలిస్తారు.దీంతో భూమి విస్తీర్ణంలో తేడాలు, సరిహద్దు వివాదాలు, రికార్డుల్లో తప్పులు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. భూ వివరాలు డిజిటలైజేషన్ కావడంతో భవిష్యత్తులో భూముల క్రయవిక్రయాలు, వారసత్వ బదిలీలు, రుణాల పొందడంలోనూ పారదర్శకత పెరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరుకానున్నట్లు తహసీల్దార్ తెలిపారు. గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు గ్రామసభలో పాల్గొనాలని సూచించారు.