సూర్య జమ్మికుంట: ప్రతి పేద కుటుంబానికి భరోసా కల్పించాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమం జమ్మికుంట మున్సిపాలిటీలో ఘనంగా ప్రారంభమైంది. పాత మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పేర్లను నమోదు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు శ్రీపతి స్వర్ణలత, నరేష్, పొన్నగంటి విష్ణు, డాక్టర్ సురంజన్, మాచర్ల రాజు, పాతకాల అనిల్, అధికారులు రాజిరెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రజలు పాల్గొన్నారు.పేద కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతోనే ఈ బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని వారు తెలిపారు.