BREAKING
ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం.. కోలాహలంగా సాగిన మీరావలి నామినేషన్ ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ నామినేషన్లు! ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు ఎల్ నినో ప్రభావం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, నూనెగింజల సాగుకు రైతులు మొగ్గు చూపాలి విద్యార్థులకు బహుమతులు అందజేత నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం పురోగతి సాధించేనా...ఈ తరం వారు రైలు కూత వినేనా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు ఉండకూడదు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్విజ్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరం పరిశీలన – డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  సుభాన్ నగర్ ఎస్టీ కాలనీలో సంయుక్త కుష్టు వ్యాధి సర్వే మరియు ఆరోగ్య పరీక్షల శిబిరం

శాతవాహన వర్సిటీ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి - గుంజపడుగు హరిప్రసాద్

Select Suryaa Now
శాతవాహన వర్సిటీ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి - గుంజపడుగు హరిప్రసాద్
సూర్య కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు వెంటనే స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. గత ఏడు రోజులుగా విద్యార్థి జేఏసీ నాయకుడు లింగంపల్లి మహేష్ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. భౌతిక శాస్త్రంలో 30 సీట్లకు 4, గణితంలో 40కి 10, కంప్యూటర్ సైన్స్‌లో 40కి 17, ఉర్దూలో 30కి 13, ఎంఎస్‌డబ్ల్యూలో 30కి 10 మంది మాత్రమే చేరగా, ఐటీ కోర్సులో 60 సీట్లకు ఒక్కరూ చేరకపోవడం ఆందోళనకరమన్నారు. ఎంఫార్మసీలో 45కి 16, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో 60కి 48, ఏఐలో 60కి 41 మంది చేరారని, ఎల్‌ఎల్‌బీలో 120 సీట్లకు 96 మంది చేరి 24 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని, గ్రామీణ విద్యార్థులకు కోర్సులు, సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు చంటి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి కుతాడి, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బత్తుల రాజు, నాయకులు చొప్పదండి యోగి, శివాజీ, సతీష్, నరేష్, రాజు పాల్గొన్నారు.