andhrapradesh
పుట్టగొడుగుల పెంపకంపై ఉచిత శిక్షణ
అవనిగడ్డ, మేజర్ న్యూస్: తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి ద్వారా స్థిరమైన ఆదాయం పొందేందుకు పుట్టగొడుగుల పెంపకం మంచి అవకాశమని శిక్షకులు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సహకారంతో గురువారం ఉచిత పుట్టగొడుగుల పెంపకం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆర్సెటి డైరెక్టర్ బి. స్వర్ణశ్రీ, అవనిగడ్డ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ హెడ్ టి. వినీల్ వరుణ్, శిక్షకులు పి. సూర్యనారాయణ, వి. ప్రవీణ్, పుట్టగొడుగుల పెంపకం శిక్షకురాలు ప్రవీణ పాల్గొని శిక్షణ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ నెల 19 నుంచి 29వ తేదీ వరకు జరిగే శిక్షణలో పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించిన మెళకువలను ప్రాక్టికల్ విధానంలో నేర్పించనున్నారు. తక్కువ పెట్టుబడితో ఉపాధి పొందే మార్గాలను వివరించారు. శిక్షణలో భాగంగా టీ-షర్టులు, క్యాప్‌లు, సమాచార పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.